వాసు ఫిల్మ్స్ నిర్మించిన చిత్రం " పుణ్యవతి". దర్శకుడు V దాదా మిరాసి. సంగీతం ఘంటసాల మాస్టారు. 1967 లో. విడుదల ఈ చిత్రంలో, డా సి నారాయణ రెడ్డి గారు వ్రాసిన "పెదవుల పైన సంగీతం" ఒక చక్కటి పాట. ఘంటసాల గళం లో మరింత హుందా గా ఉంది. ఆ పాట విందాము. పాట సేకరణ యూ ట్యూబ్ ద్వారా
కిళాంబి వెంకట నరసింహాచార్యులు అంటే కొంత మందికే తెలుసు . ఆచార్య ఆత్రేయ అంటే చాలా మందికి తెలుసు మనసు కవి అంటే చాలా చాలా .మందికి ... మనందిరికి తెలుసు. అంతలా అందరి మనసులో నిలిచి పోయిన మహా కవి ఆత్రేయ గారు. వ్రాయక నిర్మాతను, రాసి ప్రేక్షకులను ఏడి పిస్తారని చెప్తారు.
"తోడి కోడళ్ళు" చిత్రం లో ఆత్రేయ గారు రాసిన " కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడి తానా " పాట వింటే, ఆయన మనోభావాలు ఏమిటో తెలుస్తాయి. శ్రీ శ్రీ గారు రాసారా అన్న బ్రమ కలిగించి ఆశ్చర్య పరచారు.. ఇంక ఘంటసాల గారి గళం లో ఆ పాట ఎంతో మాధుర్యాన్ని పొందింది. మాస్టర్ వేణు చక్కటి సంగీతం అందించారు. అందుకే, ఈ నాటికీ ఈ పాట స్థిర స్థాయిగా నిలిచి పోయింది...
శ్రీ ఆత్రేయ గారికి జోహార్లు అందిస్తూ ..... ఈ పాట విందాము. ....
Monday, May 5, 2014
తెలుగులో మొదటి సినీ నేపధ్య గాయని శ్రీమతి రావు బాలసరస్వతి దేవి.. దేవదాస్ చిత్రం లో ఈమెపాడిన " తానే మారెన నన్నేమారెన" నేటికీ సంగీత ప్రియులకు గుర్తు ఉంది.
ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "ఇల్లరికం". విడుదలై 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 01..05. 1959 లో విడుదలై రజతోత్సవం జరుపుకొంది. మంచి కథ, మంచి సంగీతం, అక్కినేని, జమున, గుమ్మడి నటన, రేలంగి, రమణా రెడ్డి హాస్యం, చిత్ర విజయానికి దోహదం చేసాయి. సంగీతం: T చలపతి రావు. ఘంటసాల- సుశీల యుగళ గీతం " నేడు శ్రీవారికి మేమంటే పరాక ...... తగని బలే చిరాక " మంచి మెలోడీ పాట.. కేవలం చిత్రంలోనే కాకుండా, నిజ జీవితంలో కూడా, భార్యా భర్తల మధ్య ఇలాంటి చిన్న తగవులు వస్తూ ఉంటుంది. అందుకనే, ఈ పాట అందరికి వర్తిస్తుంది. ఆ పాట విందాము.