1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు' (అక్కినేని, సావిత్రి), (సంగీతం ఘంటసాల) చిత్రాన్ని, హిందీ లో "జీనే కీ రాహ్" అనే పేరుతో శ్రీ L V ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం 1969 లో విడుదల. మళ్ళీ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత శ్రీ అనుమోలు వెంకట సుబ్బా రావు గారు 1971 లో "భార్యా బిడ్డలు" (అక్కినేని, జయలలిత) పేరుతో తీసారు. ఈ చిత్రానికి శ్రీ K V మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్స్. ఘంటసాల మాస్టారు పాడిన "అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చినదానా, పరవశించి సాగుతుంది చినదానా" ఒక చక్కటి పాట. ఆ పాట విందాము.
ఈ బ్లాగ్ వీక్షిస్తున్న అందరికి "దీపావళి శుభాకాంక్షలు" జగపతి పిక్చర్స్ నిర్మించిన మొదటి చిత్రం ' అన్నపూర్ణ'. ఈ చిత్రం 1960 లో విడుదల. శ్రీ V. మధుసూదన్ రావు దర్సకత్వం వహించగా, సంగీతం శ్రీ సుసర్ల దక్షిణామూర్తి సమకూర్చారు. అన్ని పాటలు శ్రీ ఆరుద్ర వ్రాసారు. ఈ చిత్రంలో ఘంటసాల-జిక్కి పాడిన యుగళ గీతం " వగలాడి వయ్యారం భలే జోరు, నీ వయ్యారం ఒలికించు ఒన్స్ మోరు" రేలంగి, గిరిజ మీద చిత్రీకరించిన ఈ పాట, ఆ రోజుల్లో ఒక ఊపు ఊపిన మాట వాస్తవం. ఘంటసాల మాస్టారు ఎంతో హుషారుగా పాడి, పాటకు ప్రాణం పోసారు. ఘంటసాల గారు ఈ చిత్రంలో పాడింది ఈ ఒక్క పాటే అయినా, ఈ పాటే చిత్రానికి హై లైట్ గా నిలిచింది. ఆ పాట విందాము.