Monday, February 11, 2013

ఘంటసాల మాస్టారు వర్ధంతి నేడు

ఘంటసాల మాస్టారు వర్ధంతి నేడు. కాలం ఎంత తొందరగా పరిగెడుచున్నా, ఘంటసాల గారి పాటలు మాత్రం ఇంకా అంతే ఆదరణతో అలరారుతున్నాయి. మాస్టారు గాత్రం మూగబోయి దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచినా. ఆయన పాడిన పాటలు నేటికి నూతనంగా ఉన్నాయంటే అది మాస్టారి గొప్పతనమే. ఆయన వర్ధంతి సందర్బంగా ఈ కవితను సమర్పిస్తున్నాను.

           ఘంటసాల  నాయకా ........
           స్వరాల మాంత్రికా  ............                      
           గాన గంధర్వ గాయకా ..............                            
           అందుకో మా నీరాజన  మాలిక ...............

                కాలం ఎంత కరిగిపోయినా ............
           గాత్రం మూగబోయి నాలుగు దశాబ్దాలైనా ..............
           నీ గానం అజరామరమై అలరారుతున్నది .............
           అంతే నూతనంగా, నిత్య యవ్వనంగా .............

           పాడిన ప్రతి పాటకు ప్రాణం పోసావు 
           ఆ పాటకు మరణం లేకుండా చేసావు 
           నీ జీవితం ధన్యం చేసుకొన్నావు 
           నీవు లేదన్న  నిజాన్ని  మరిపించావు 


                                            .ఘంటసాల గారి వీరాభిమాని  కాశి వెంకోబ రావు 
                                               9885482942                     


2 comments:

  1. పాటకు మరణం లేకుండా చేసావు....నిజం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు. ఆయన పాడిన ప్రతి పాట అలాంటిది. వాటికి మరణం లేదు.
      పాటకే కాదు, ఆ పాట విన్న ప్రతి మనిషికి నిండు ఆరోగ్యం

      Delete