శ్రీ ఘంటసాల మాస్టారు నా ఆరాధ్య దైవం. దాదాపు 55 సంవత్సరాలుగా ఆయన పాటలు వింటూ ఆనందిస్తున్నాను. ఆ పాటల మహిమ వల్ల నాకు ఏ రోగాలు రాలేదు/లేదు నాకు 66 వయస్సు వచ్హినా, మనసు ఉల్లాసంగా/నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం మాస్టారు పాటలే అంటే అతిశయోక్తి కాదు. ఆయన మీద ఉన్నఅభిమానంతో ఈ బ్లాగ్ మొదలుపెట్టి, నా తొలి ప్రయత్నంగా ఒక కవిత వ్రాసి సమర్పిస్తున్నాను. ఆదరించ గలరు. ఈ బ్లాగ్ ఏర్పాటుకు తన వంతు సలహా సహకారం అందించిన శ్రీ సూర్యనారాయణ వులిమిరి, మోరిసవిల్, నార్త్ కెరొలిన గారికి నా కృతజ్ఞతలు.
రాగాల ......సరాగాల....గానమాల.. ఘంటసాల
సప్త స్వరాల...... కళాశాల ఘంటసాల
సప్త స్వరాల...... కళాశాల ఘంటసాల
తెలుగు కళామ తల్లికి లబించిన గాన గంధర్వుడు ఘంటసాల
పాటలకు ప్రాణం పోసిన అమరగాయకుడు ఘంటసాల
ఏడు స్వరాలను ఏడు లోకాలకు వినిపించిన అమరగాయకుడు ఘంటసాల
ఆయన పాడిన పాటలు నిత్యము, సత్యము, నిరంతరం
ఆ పాటలకు లేదు మరణం............. అవి ....అజరామరం
తరాలు మారినా అంతరాలు మారని పాటలు పాడిన గానగంధర్వుథు ఘంటసాల
ఆయన పాడిన పాటలు నిత్యము, సత్యము, నిరంతరం
ఆ పాటలకు లేదు మరణం............. అవి ....అజరామరం
తరాలు మారినా అంతరాలు మారని పాటలు పాడిన గానగంధర్వుథు ఘంటసాల
శ్రీ తిరుమల వేంకటేశ్వర సమ స్థానం,
గానగంధర్వ ఘంటసాల గానామృతం
న...... భూతో......... న......... భవిష్యతి
న...... భూతో......... న......... భవిష్యతి
వెంకోబ రావు కాశి
క్యాంపు అట్లాంటా
చాల బాగుంది మీ బ్లాగు వెంకోబా రావు గారు. బ్లాగోద్యాన వనంలో మీ తొలి పుష్పం ముద్దుగా వుంది. మీ పరిచయం అదృష్టంగా భావిస్తాను. మీ పోస్టుకు నాదే మొదటి వ్యాఖ్య. మాస్టారి గురించి ఇంకా ఎన్నో విషయాలు వ్రాస్తారని ఆశిస్తూ..మళ్ళీ కలుద్దాం.
ReplyDeleteధన్యవాదాలు శ్రీ సూర్యనారాయణ గారు. మీరే నా బ్లాగ్ లో విరిసిన పుష్పానికి వన్నె తెచ్చిన వారు. మీ సహకారం లేక పోతే నా బ్లాగ్ ఉద్బవించేది కాదు మీ సలహా లను తప్పక పాటిస్తాను
Deleteవెంకోబ రావు కసి
బావుందండీ..
ReplyDeleteఘంటసాల గారి గురించి ఎన్ని బ్లాగులు పెట్టినా తక్కువే... కారణం మరేం లేదు....దేవుడు ఒకొక్కరికి ఒకోరకంగా కనిపించినట్టు మాస్టారుగారి పాటల ప్రభావము ఒక్కొక్కరిపై ఒక్కోవిధంగా ఉంటుంది... ఎవరి అనుభవాలు , స్పందనలు వారివే కదా , మీకు శుభాకాంక్షలతో పాటు అభినందనలు.
జనార్దన శర్మ
All the best
ReplyDeleteశ్రీ జనార్ధన శర్మ గారికి
ReplyDeleteమీ అబినందనలకు ధన్యవాదాలు. మీ లాంటి వారి ఆశీస్సులు నాకు తప్పకుండా కావాలి. ఎలాంటి తప్పులు దొర్లినా మన్నిస్తారని ఆశిస్తున్నాను
premotho
వెంకోబ రావు కాశి
"తరాలు మారినా అంతరాలు మారని పాటలు పాడిన గానగంధర్వుథు ఘంటసాల" - ఈ వాక్యం నిత్యమూ సత్యము
ReplyDelete