Showing posts with label డిసెంబర్ 4 ఘంటసాల గారి 92 వ జయంతి.. Show all posts
Showing posts with label డిసెంబర్ 4 ఘంటసాల గారి 92 వ జయంతి.. Show all posts

Friday, December 5, 2014

"గాయకులలో ఘంటసాల ను నేనే"-- శ్రీ కృష్ణ ఉవాచ

డిసెంబర్ 4 ఘంటసాల గారి 92 వ  జయంతి.  అంతకు రెండు రోజుల ముందు, అనగా డిసెంబర్ 2, శ్రీ కృష్ణ జయంతి జరిగింది. 
ఘంటసాల మాస్టారు చివర దశలో "శ్రీ భగవథ్గీత " గానం చేసి, తన జన్మ సార్థకం చేసుకున్న మహా మనిషి. 

భగవథ్గీత లోని, 10 వ ఆధ్యాయంలో, శ్రీ గీతా  చార్యుడు చెప్పారు :

                           "మహార్షీ ణామ్ భ్రుగు రహం      
                             గిరామస్మేక్య మక్షరం 
                             యజ్ఞానాం జప యజ్ఞో స్మే 
                             స్థావరాణాం హిమాలయః " 
దీని అర్థం " నేను మహర్షులలో భ్రుగువును, శబ్దములలొ ఓంకారమును , యజ్ఞములలో జప యజ్ఞమును,
స్థావరములలో హిమవంతుడను". 

ఇంకా ఏమి  చెప్పారంటే , దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, సిద్దులలో కపిల మునియు,
ఏనుగులలో ఐరావతము, దేనువులలో కామధేనువు, సర్పములలో వాసుకి  ఇలా చాలా చాలా, అన్నీ తనే అని  చెప్పారు ........  కాని
గాయకులలో ఎవరో చెప్పకుండా వదేలేసారు.?
మనం ఇప్పుడు  "గాయకులలో ఘంటసాల ను నేనే" అని  కృష్ణుని మాటగా సగర్వంగా చెప్పు కొందాము. మనం ఘంటసాల గారికి ఇచ్చే నిజమైన నివాళి ఇదే.