శరత్ నవల "దత్త" (వాగ్దత్త) ఆధారంగా తీసిన చిత్రం "వాగ్ధానం". ఈ చిత్రం 05-10-1961 లో విడుదలై సంగీత పరంగా విజయం సాదించింది. నిర్మాతకు నష్టం వాటిల్లినా, కథా, పాటలు చాలా బాగున్న చిత్రంగా చెప్పుకోవచ్చు. శ్రీ ఆచార్య ఆత్రేయ నిర్మించి, దర్సకత్వం వహించిన చిత్రం. అక్కినేని, కృష్ణకుమారి, నాగయ్య, గుమ్మడి, రేలంగి, చలం, సూర్యకాంతం, గిరిజ, పద్మనాభం, నటించిన భారీ తారాగణ చిత్రం. ఆత్రేయ స్వయానా రచయిత అయినా, శ్రీ శ్రీ, దాశరథి, ఆరుద్ర లతో పాటలు వ్రాయించి, తన సౌజన్యత ను చాటు కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్ చేసారు. వాటిల్లో శ్రీ శ్రీ వ్రాసిన హరికథ "శ్రీ నగజా తనయం సహృదయం" ఘంటసాల మాస్టారు చే పాడించి చిత్రానికే వన్నె తెచ్చారు. ఘంటసాల గారు హరికథను అద్భుతంగా గానం చేసి ప్రాణం పోశారు. ఇక్కడ రేలంగి హరికథ చెప్పుతుంటే, అక్కడ నాయిక, నాయకుణ్ణి ఓర చూపులు చూడడం, గుర్రం బండి గుంతలో దిగబడితే, నాయకుడు దాన్ని బయటకు నెట్టడం మొదలగు నవి దర్శకుని ప్రతిభకు తార్కాణం. హరికథలో వినిపించిన మాటలు కూడా ఘంటసాల గారివే. ఇప్పుడు హరికథ విందాం, ఘంటసాల గాత్రాన్ని విని ఆనందిద్దాము.