Showing posts with label "వాగ్ధానం" (1961)/3. Show all posts
Showing posts with label "వాగ్ధానం" (1961)/3. Show all posts

Wednesday, June 19, 2013

"నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవనీరా"

  మనసు కవి "ఆచార్య ఆత్రేయ" నిర్మించి, దర్సకత్వం వహించిన చిత్రం "వాగ్ధానం. ఈ చిత్రం 1961 లో విడుదలై సంగీత పరంగా విజయం సాధించింది.   శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్శకుడు. మంచి బాణీలు సమకూర్చి అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంతో  శ్రీ దాశరథి సినీ రంగ ప్రవేశం చేసారు. ఆయన వ్రాసిన 
"నా కంటి పాపలో నిలిచిపోరా,  నీ వెంట లోకాల గెలవనీరా" ఒక అద్భుత యుగళ గీతం. ఘంటసాల మాస్టారు, సుశీల పాటకు ప్రాణం పోసారు.  పాట చిత్రీకరణ కూడా చాల బాగుంది. పాట వింటూ ఉంటె, మనం కూడా ఏదో లోకంలో విహరించినట్టు ఉంటుంది.  అంత మహిమ ఆ పాటలో ఉంది. ఆ పాట విందాము.