1953 లో వచ్చిన "బ్రతుకు తెరువు" చిత్రాన్ని తమిళంలో "భలే రామన్" పేరుతో అనువాదం చేసి విడుదల చేసారు. తమిళం లో కూడా విజయం సాధించింది. అక్కినేని పియానో ఫై పాడిన పాట అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం ఒక గొప్ప మెలోడీ పాట. ఘంటసాల మాస్టారు స్వర పరచి పాడారు. ఘంటసాల గారికి ఎంతో ఇష్టమైన పాటగా చెప్పుకొంటారు. మాస్టారు ఎక్కడ కచేరి చేసినా ఈ పాటతో మొదలుపెట్టి, దేవదాసు చిత్రంలోని జగమే మాయ తో ముగించేవారని చెప్పగా విన్నాను. భలే రామన్ చిత్రంలో లోని పాట " ఎంగుమే ఆనందం, ఆనందమే జీవనిన్ మకరంధం" కూడా ఘంటసాల మాస్టారు అంతే అందంగా, స్వచ్చంగా పాడారు. మాస్టారు కు తమిళం రాక పోయినా, పాటలోని చరణాలను ఆయన గళం అద్భుతంగా పలికింది. అది ఘంటసాల గారి గొప్పతనం. ఆ పాట విందాము.