డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ మధ్యనే తమ పుట్టిన రోజు పండుగ జరుపుకున్నారు. ( జూలై 29)
గత 52 సంవత్సరాలుగా ఆయన సినీ రంగానికి చేసిన సేవలు అమోఘం.
1962 లో "గులేభకావలి కథ" చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయ మయ్యారు. ఈ చిత్రం లోని
"నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని " పాటతో తెలుగు హృదయాలను దోచుకొన్నారు.
నేటికి ఈ పాట అజరామరమై శ్రోతల మనసులో నిలిచి ఉంది. ఈ చిత్రానికి సంగీతం: జోసెఫ్ అండ్ విజయా కృష్ణమూర్తి ఆ పాట విందాం