బొబ్బిలి యుద్ధం 1964 లో విడుదలైన చారిత్రాత్మక చిత్రం. దర్శక నిర్మాత శ్రీ సీతారం. మేటి తారాగణం గల చిత్రం. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. పాటలన్నీ బగున్నయి. ఘంటసాల సుశీల పాడిన "మురిపించే అందాలే అవి నన్నేచెందాలె " బాగా పాపులర్ అయిన యుగళ గీతం.
తెర మీద సీతారం జమున మీద చిత్రీకరించారు . సీతారం వేసిన పాత్రకు అక్కినేనిని దృష్టిలో పెట్టుకొని, ఘంటసాల గారిచే రెండు యుగళ గీతాలు రికార్డు చేసారట., సంగీత దర్శకులు మరియు నిర్మాత సీతారం గారలు. కొన్ని కారణాల వల్ల అక్కినేని ఆ పాత్రను వేయలేదు. అప్పుడు దర్శక నిర్మాత అయిన శ్రీ సీతారం గారే వేసారు. ఆ పాటలను వీరి మీద చిత్రీకరించడం జరిగింది.
ఆ పాట విందాం. సేకరణ యు ట్యూబ్ ద్వారా. వారికి కృతజ్ఞతలు.