Thursday, March 13, 2014
" ఇంగ్లీషు లోన మ్యారేజి, హిందీ లో అర్థము షాది"
Sunday, March 9, 2014
"చేతిలో చెయ్యేసి చెప్పు బావ, చేసుకొన్న బాసలు చెదిరి పోదని".
జగపతి పిక్చర్స్ వారు నిర్మించిన చిత్రం 'దసరా బుల్లోడు'. నిర్మాత, దర్శకుడు శ్రీ V B రాజేంద్ర ప్రసాద్. విడుదల 13-01-1971.
అప్పటివరకు కేవలం నిర్మాత గానే ఉంటూ వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రానికి దర్సకత్వం వహించి, చిత్రాన్ని సూపర్ డూపర్ విజయం చేసారు. మామ మహదేవన్ అందించిన సంగీతం, చిత్రాన్ని తారాపథంలో నిలపెట్టింది. పల్లె వాతావరణం, అక్కినేని పంచ కట్టు, హీరో కున్న బుల్లి కారు, వాణిశ్రీ హావ భావాలూ, చిత్రానికి వన్నె తెచ్చాయి.
పాటలు, పాటల చిత్రీకరణ అమోఘంగా ఉండి , కుర్ర కారును, మహిళా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆత్రేయ కలం నుండి జారు వాలిన పాటలన్నీ మధురంగా ఉండి, ఘంటసాల గాత్రంలో అవి అజరామరంగా నిలిచిపోయింది. అలాంటి పాటే,
"చేతిలో చెయ్యేసి చెప్పు బావ, చేసుకొన్న బాసలు చెదిరి పోదని". ఆ పాట విందాము.\\
వీడియో క్లిప్పింగ్ దొరక లేదు. ఆడియో మాత్రమే ఉంది.
Thursday, March 6, 2014
'తెల్ల చీర కట్టుకొన్నది ఎవరికోసము'
జగపతి పిక్చర్స్ పరంపరలో వచ్చిన 4వ చిత్రం "అంతస్తులు". చిత్ర దర్శకుడు శ్రీ V. మధుసూదన్ రావు, సంగీతం శ్రీ K V మహదేవన్. అక్కినేని,భానుమతి, కృష్ణకుమారి, గుమ్మడి, జగ్గయ్య, రేలంగి, రమణా రెడ్డి నటించిన చిత్రం, మంచి ప్రజాదరణ పొందింది. పాటలన్నీ బాగున్నాయి. ఘంటసాల సుశీల గారలు పాడిన 'తెల్ల చీర కట్టుకొన్నది ఎవరికోసము' సూపర్ హిట్ పాట. రచన శ్రీ ఆత్రేయ. ఆ పాట విందాము.
Subscribe to:
Posts (Atom)