Thursday, January 10, 2013

"మనసు పరిమళించెనే"



జయంతి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "శ్రీ కృష్ణార్జున యుద్ధం". దర్శక-నిర్మాత శ్రీ కే.వీ.రెడ్డి గారు. ఈ చిత్రం 9-1-1963 లో విడుదలై, ఇటు పండితులను, అటు  పామరులను అలరించింది. 50 సంవత్సరాలు క్రిత్రం వచ్చిన ఈ చిత్రరాజం, నేటికీ నిత్య నూతనంగా అలరారుతోంది. శ్రీ పెండ్యాల సంగీతంలో పాటలూ, పద్యాలూ,బహుళ ప్రజాదరణ పొందినవి. ఘంటసాల మాస్టారు ఎంతో వైవిధ్యంగా అటు రామారావుగారికి, ఇటు నాగేశ్వరరావు గారికి పాడి ప్రజలను మెప్పించారు. శ్రీ పింగళి గారి రచనలో అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. ఘంటసాల, సుశీల గారలు పాడిన "మనసు పరిమళించెనే" పాట విందాము.