శారదా ప్రొడక్షన్స్ వారి "జయభేరి" 9-4-1959 లో విడుదలైన చిత్రం. ఇది ముఖ్యంగా సంగీత ప్రాధాన్యత గల చిత్రం. ఈ చిత్రానికి శ్రీ పి.పుల్లయ్య దర్సకత్వం వహించగా శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు అద్భుతమైన సంగీతం సమకూర్చి అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంలో అన్ని క్లాసికల్ పాటలే. ఘంటసాల, పీ.బీ.శ్రీనివాస్, పాణిగ్రాహీ గానం చేసిన, "మది శారదా దేవి మందిరమే" ఒక గొప్ప క్లాస్సికాల్ పాట. ఘంటసాల మాస్టారు అద్భుతంగా గానం చేసారు. గీత రచన శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. కళ్యాణి రాగం లో స్వర పరచిన పాట.