Thursday, January 15, 2015

TOP 10 SONGS OF GHANTASALA GARU FROM TAMIL FILMS


ఘంటసాల మాస్టారు తెలుగు లో ఎంత స్పష్టంగా పాడారో, అంతే స్పష్టత తమిళ సినిమాలలో కూడా కనిపిస్తుంది. ఆ పాటలలో అంతే కృషి, అంతే పట్టుదల. అందుకే అవికూడా ప్రజాదరణ పొందినవి. 
తమిళం లో పాడిన పాటలన్నీ తెలుగు లో ఉన్నవే.  ఆ పాటలు మనం తెలుగులో ఎన్నో సార్లు విని ఉంటాం. కాని తమిళం లో చాలా అభిమానులు విని ఉండరు.  వారికోసం  మాస్టారు గారు పాడిన 10 టాప్ తమిళ పాటలను   (ఆడియో) పోస్ట్ చేశాను. మాస్టారి అభిమానులందరూ విని ఆనందిస్తారు కదూ.





Wednesday, January 14, 2015

' చేతిలో చెయ్యేసి చెప్పు బావ'



ప్రఖ్యాత నిర్మాత-దర్శకుడు శ్రీ వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్ కు స్మృత్యాంజలి గా " దసరాబుల్లోడు" చిత్రం లోని ' చేతిలో చెయ్యేసి చెప్పు బావ' పాటను వినిపిస్తున్నాను. (ఆడియో మాత్రమే). 
రెండో క్లిప్పింగ్లో లో అదే చిత్రం లోని అన్ని పాటలు వినిపిస్తున్నాను. 

శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, మంచి అభిరుచి ఉన్న నిర్మాతే కాకుండా, మంచి భావాలు ఉన్న దర్శకుడు. అంత కంటే మనసున్న మహా మనిషి.  సంగీతం పట్ల ఆసక్తి ఉన్న నిర్మాత . అందుకే ఆయన నిర్మించిన అన్ని చిత్రాలలో, అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ .... ఆయనకు ఇదే నా శ్రద్ధాంజలి 



Tuesday, January 13, 2015

ఓ తారకా..... ఓ.. జాబిలీ (చండీరాణి) మూడు బాషలో హిందీ, తమిళం, తెలుగు



చండీరాణి  మూడు బాషలలో విడుదలైన చిత్రం. శ్రీమతి భానుమతి దర్సకత్వం వహించి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం.  సంగీతం సీ  ఆర్  సుబ్బరామన్  & విశ్వనాథన్ రామమూర్తి .  ఓ తారక ,,ఓ  జాబిలీ  ఒక సూపర్ డూపర్ పాట . తెలుగు, తమిళం లో ఘంటసాల-భానుమతి, హిందీలో తలత్ మహ్మద్ -భానుమతి పాడారు . కాని నిస్సందేహంగా తెలుగు పాటే అద్భుతం.  క్రింద ఆ మూడు పాటలు పొందు పరచాను. విని మీరే నిర్ణయించండి. 
ఓ . చందా. చలే ..   ముష్కురాయే.. జవానియ  (హిందీ)  రచన: విశ్వామిత్ర ఆదిల్ 
వాన్ .. మీదిలే.. ఇన్బ తేన్           ( తమిళం)     రచన:K D సంతానం 
ఓ ...తారక  ...ఓ  .. జాబిలీ         (తెలుగు)        రచన సముద్రాల సీనియర్    











Thursday, January 8, 2015

ఘంటసాల ముందు పలుకులు దేవదాస్ చిత్రం లోని జగమే మాయ పాటకు



వినోదా పిక్చర్స్ బ్యానర్ లో D L నారాయణ నిర్మించిన చిత్రం "దేవదాస్". ఈ చిత్రం ఎందరికో కీర్తి ప్రతిష్ఠలు  ఆపాదించిన సంగతి అందరికి తెలుసు. అక్కినేని, సావిత్రి, ఘంటసాల, సుబ్బరామన్, సముద్రాల సీనియర్, వేదాంతం  రాఘవయ్య ఇలా అందరూ చిత్రానికి వన్నె తెచ్చారు. 26-06-1953 విడుదలైన చిత్రం, 61 సంవత్సరాలు నిండినా, ప్రేక్షకుల మనోభావం లో స్థిర స్థాయిగా నిలిచి ఉన్న చిత్ర రాజం. అన్ని పాటలు బహుళ ప్రజాదరణ పొంది, నేటికీ అజరామరంగా నిలిచి ఉన్నాయి. ఏనాటికి ఇలాగె నిలిచి ఉంటాయి. 

ఘంటసాల గానం చేసిన "జగమే మాయ,  బ్రతుకే మాయ,  వేదాలలో సారం ఇంతే నయా", మనసును కదిలించే పాట . మాస్టారుకు ఎంతో ఇష్టమైన పాట గా చెప్పుకొంటారు... మొదటి వీడియో క్లిప్పింగ్ లో ఈ పాట వినండి. 
రచన సముద్రాల సీనియర్, 

ఘంటసాల గారు 1971 లో అమెరికా వెల్లినప్ప్దుదు ఎన్నో సంగీత కార్యక్రమాలు చేసారు. ఒకానొక ప్రోగ్రాం చికాగో లో చేసి నప్పుడు, ఘంటసాల గారు ఈ పాటను గురించి చెప్పి స్టేజి మీద పాడారు. రెండో వీడియో క్లిప్పింగ్ లో ఆ పాట (లైవ్ కన్సర్ట్) వినండి. (ఘంటసాల ముందు పలుకులు దేవదాస్ చిత్రం లోని జగమే మాయ పాటకు)

మొదటి వీడియో క్లిప్పింగ్ పాటకు, రెండో క్లిప్పింగ్ పాటకు వ్యత్యాసం గమనించండి. అమెరికా లో పాడిన 'జగమే మాయ పాట ను మాస్టారు ఎంతో Improvise చేసి పాడి ఒక కొత్త ప్రయోగం, ఆనాడే, అంటే 1971 లోనే చేసారు. 
ఘంటసాల అభిమానులు అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.  కాకపోతే, రెండో క్లిప్పింగ్లో లో పూర్తి పాట లేకపోవడం దురదృష్టం












Saturday, January 3, 2015

"పైకం తో కొనలేమిది ఏది లేదు, నా మైకం లో పడని వాడు ఎవరూ లేరు "




Anthasthulu.jpg

జగపతి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "అంతస్తులు". జగపతి వారికి చిత్రం పేరు పెట్టడంలో ఒక ప్రత్యేకత ఉంది.   
వారి మొదటి చిత్రం 'అన్నపూర్ణ " తో మొదలై దాదాపు అన్ని చిత్రాలు "అ " లేక :"ఆ"వచ్చినవే. 
అన్నపూర్ణ, ఆరాధన. ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతుడు, అక్కచెల్లెళ్ళు మొదలైనవి. ఆ ఒరవడి ;దసరాబుల్లోడు తో మారింది. 

అంతస్తులు చిత్రం లోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే.  ఘంటసాల సుశీల పాడిన పాట 
"పైకం తో కొనలేమిది ఏది లేదు, నా మైకం లో పడని వాడు ఎవరూ లేరు ". తెర మీద  అక్కినేని, L విజయలక్ష్మిల 
మీద చిత్రీకరించారు  దర్శకులు V. మధుసూదన రావు, సంగీతం మామ మహదేవన్. గీత రచన ఆరుద్ర చిత్రం విడుదల 27-05-1965.