Thursday, October 31, 2013

"జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారం ఇంతేనయా"

ఘంటసాల మాటలలో   దేవదాస్ చిత్రంలోని "జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారం ఇంతేనయా" పాట యొక్క వివరణ వినండి. 
ఒక సందర్భంలో, మాస్టారు  చెప్పారు  ఆ పాట లో వచ్చిన దగ్గు కూడా తనదే అని.  ఇప్పుడు వినిపించ బోయే 

  పాట చిత్రంలోనిది కాకుండా,  ఇతర  దేశాలలో పాడి నప్పుడు రికార్డు చేయ బడినది. ఈ వీడియో క్లిప్పింగ్ అందించిన వారు శ్రీ అప్పారావు వింజమూరి కి కృతజ్ఞతలు. 
 గీత రచన శ్రీ సముద్రాల సీనియర్. సంగీతం శ్రీ సీ ఆర్ సుబ్బరామన్.


Saturday, October 26, 2013

"మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అదే స్వర్గము"

శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారి వర్ధంతి నేడు . (26 అక్టోబర్).
 శ్రీ రాజేశ్వర రావు గారు నిరాడంబరుడు, ఆత్మగౌవరం 
 కోసం ఎన్నో  సినిమాలు వదులుకొన్న మహా మనిషి.
శ్రీ రాజేశ్వర రావు గారికి ఘంటసాల అంటే మిక్కిలి ఇష్టం.
నటునిగా, నేపథ్య గాయకునిగా, సంగీత దర్సకుడుగా, శ్రీ సాలూరు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి.  ఆయన దాదాపు 150 చిత్రాలకు సంగీత దర్సకత్వం వహించారు.
రాజేశ్వరరావుకి మెదడు నిండా సంగీతమే అని ఒక సందర్భంలో రావు బాలసరస్వతి గారు చెప్పారు.
డాక్టర్ చక్రవర్తి చిత్రానికి సాలూరు వారు అందించిన స్వరాలూ అమోఘం. ముఖ్యంగా, ఘంటసాల గారు పాడిన
"మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యమూ .. అదే స్వర్గము" మనసును కదిలించే పాట. శ్రీ శ్రీ గారు వ్రాసిన ఈ పాటకు, సాలూరు వారు అందించిన బాణీ, ఘంటసాల గారి గళం లో అజరామరమై నిలిచిపాయింది.  

శ్రీ సాలూరు గారికి నివాళులు అందిస్తూ, ఈ పాట విందాము.




Friday, October 25, 2013

" చల్ల గాలిలో ..ఓ ...... .యమునా తటిపై శ్యామసుందరుని మురళి"






 ఈ పాట ఘంటసాల గారు పాడిన పాట కాదు. గమనించ గలరు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారి జయంతి (12 అక్టోబర్ ), వర్ధంతి ( 26 అక్టోబర్) పురస్కరించుకొని, ఆయన్ను స్మరిస్తూ, ఆయన పాడి, స్వర పరచిన గీతం " చల్ల గాలిలో ..ఓ ...... .యమునా తటిపై శ్యామసుందరుని మురళి" పాట విందాము.
శ్రీ సాలూరు గారికి ఎంతో ఇష్టమైన రాగాలు: యమునాకళ్యాణి. మోహన, భీంప్లాస్, శుద్ధసావేరి, మాల్కోస్, హిందుస్తానీ భైరవి.
ఈయన దాదాపు 150 చిత్రాలకు సంగీత దర్సకత్వం వహించారు. 
సాలూరు గారికి  అభిమాన సంగీత దర్శకులు : శ్రీ నౌషద్ అలీ ( హిందీలో), తెలుగు లో పెండ్యాల, తమిళంలో M S విశ్వనాథన్. 
అభిమాన గాయకులు: ఘంటసాల, సైగల్, పంకజ్ మల్లిక్ , సుశీల

అపస్వరం తెలియని రాజేశ్వర రావు గారు, సుమధుర సుస్వరాలతో తెలుగు సినిమా పాటకు పట్టాభిషేకం చేసారు . ఆయన పాటలు నిత్య నూతనంగా నేటికీ సజీవమై అలరారుతోంది. 

ఇప్పుడు విందాము ఆయన  పాడిన  పాట:










Thursday, October 24, 2013

"మధురమైన రేయిలో మరపు రాని హాయిలో, పండు వెన్నెలే నేడు పాడే నేలనో"


సాధనా ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం "తోబుట్టువులు". 1963 లో విడుదలైన ఈ చిత్రానికి నిర్మాత-దర్శకుడు శ్రీ సి వీ రంగనాథ్ దాస్, సంగీతం సి మోహన్ దాస్. చిత్రం విజయం సాధించక  పోయీనా, చిత్రంలోని పాటలు చాలా  బాగున్నాయి. కారణం ఘంటసాల.   చిత్ర కథానాయకుడు ఎవరైనా, ఏ సంగీత దర్సకుడైనా, పాటకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు మాస్టారు. శ్రీ అనిసెట్టి వ్రాసిన, ఘంటసాల, సుశీల గారలు పాడిన "మధురమైన రేయిలో మరపు రాని హాయిలో, పండు వెన్నెలే నేడు పాడే నేలనో" 
మంచి మెలోడీ పాట. ఘంటసాల సుశీల గారలు ఎంతో మధురంగా పాడారు. ఈ పాటను, జగ్గయ్య జమున ల మీద చిత్రీకరించారు. పాట విని ఆనందించండి. నిన్న ఈ చిత్రంలోని పాట సాగెను జీవిత నావా పోస్ట్ చేశాను. ఈ రెండు పాటలు ఈ చిత్రానికి వన్నె తెచ్చాయి. 


Wednesday, October 23, 2013

" సాగేను జీవిత నావా, తెర చాప లేక ఈ త్రోవా, దరిజేర్చు దైవము నీవే నా ఆశ తీర్చ రావే"

సాధనా ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం "తోబుట్టువులు". 1963 లో విడుదలైన ఈ చిత్రానికి నిర్మాత-దర్శకుడు శ్రీ సి వీ రంగనాథ్ దాస్, సంగీతం సి మోహన్ దాస్. చిత్రం విజయం సాధించక  పోయీనా, చిత్రంలోని పాటలు చాలా  బాగున్నాయి. కారణం ఘంటసాల.   చిత్ర కథానాయకుడు ఎవరైనా, ఏ సంగీత దర్సకుడైనా, పాటకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు మాస్టారు. శ్రీ అనిసెట్టి వ్రాసిన, ఘంటసాల, సుశీల గారలు పాడిన
" సాగేను జీవిత నావా, తెర చాప లేక ఈ త్రోవా,  దరిజేర్చు దైవము నీవే 
   నా ఆశ తీర్చ రావే"......................
 మంచి మెలోడీ పాట. ఘంటసాల సుశీల గారలు ఎంతో మధురంగా పాడారు. ఈ పాటను మహానటి సావిత్రి, కాంతారావు ల మీద చిత్రీకరించారు. పాట విని ఆనందించండి.






Thursday, October 17, 2013

" ఓ నెల రాజా, వెన్నెల రాజా, నీ వన్నెలన్ని చిన్నెలన్ని మా కే లోయీ"


"భట్టి విక్రమార్క" చిత్రం 1960 లో విడుదలై విజయం సాదించిన చిత్రం. నిర్మాత శ్రీ P V V సత్యనారాయణ మూర్తి,  దర్సకత్వం శ్రీ జంపన చంద్రశేఖర రావు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు.  ఈ చిత్రం లోని ఘంటసాల, సుశీలపాడిన " ఓ నెల రాజా, వెన్నెల రాజా, నీ వన్నెలన్ని చిన్నెలన్ని మా కే లోయీ" మంచి మెలోడీ పాట. ఈ నాటికీ అంతే ఆదరణ తో అలరారుతోంది. ఆ పాట విందాము. వీడియో యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి, ఆ వీడియో అందించిన తేజా వీడియో వారికీ నా కృతజ్ఞతలు. 




Monday, October 14, 2013

"జీవనమే పావనం"







శ్రీ  విట్టాలా చార్య  నిర్మించి దర్సకత్వం వహించిన చిత్రం "శ్రీ కనక దుర్గా పూజా మహిమ., ఈ చిత్రం 1960 లో వచ్చింది  రాజెన్ నాగేంద్ర సంగీతం. ఘంటసాల,  రాజ్యలక్ష్మి పాడిన "జీవనమే పావనం"  ఒక చక్కటి పాట . గీత రచన శ్రీ కృష్ణ మూర్తి..