Monday, February 25, 2013

" తెల్ల వారనీయకు ఈ రేయిని "

జగపతి పిక్చర్స్ వారు అన్నపూర్ణ , ఆరాధన తరువాత తీసిన చిత్రం "ఆత్మబలం". అక్కినేని, జగ్గయ్య, సరోజా దేవి నటించారు. ఈ చిత్రం 09-01-1964 లో విడుదలైంది.   దర్సకత్వం శ్రీ వి.మధుసూదన్ రావు గారు, సంగీతం శ్రీ కే.వీ. మహదేవన్ సమకూర్చారు. మంచి సంగీతం, కథా బలం ఉన్న చిత్రం కాబట్టే విజయం సాధించింది.   ఈ చిత్రంలోని అన్నీ పాటలు  బహుళ ప్రజాదరణ పొందినవే. ఘంటసాల, సుశీల పాడిన యుగళగీతం " తెల్ల వారనీయకు  ఈ రేయిని " మంచి మెలోడి  పాట. రచన ఆత్రేయ . ఆ పాట విందాము/ వీడియో క్లిప్పింగ్ చూద్దాం. 




Monday, February 11, 2013

ఘంటసాల మాస్టారు వర్ధంతి నేడు

ఘంటసాల మాస్టారు వర్ధంతి నేడు. కాలం ఎంత తొందరగా పరిగెడుచున్నా, ఘంటసాల గారి పాటలు మాత్రం ఇంకా అంతే ఆదరణతో అలరారుతున్నాయి. మాస్టారు గాత్రం మూగబోయి దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచినా. ఆయన పాడిన పాటలు నేటికి నూతనంగా ఉన్నాయంటే అది మాస్టారి గొప్పతనమే. ఆయన వర్ధంతి సందర్బంగా ఈ కవితను సమర్పిస్తున్నాను.

           ఘంటసాల  నాయకా ........
           స్వరాల మాంత్రికా  ............                      
           గాన గంధర్వ గాయకా ..............                            
           అందుకో మా నీరాజన  మాలిక ...............

                కాలం ఎంత కరిగిపోయినా ............
           గాత్రం మూగబోయి నాలుగు దశాబ్దాలైనా ..............
           నీ గానం అజరామరమై అలరారుతున్నది .............
           అంతే నూతనంగా, నిత్య యవ్వనంగా .............

           పాడిన ప్రతి పాటకు ప్రాణం పోసావు 
           ఆ పాటకు మరణం లేకుండా చేసావు 
           నీ జీవితం ధన్యం చేసుకొన్నావు 
           నీవు లేదన్న  నిజాన్ని  మరిపించావు 


                                            .ఘంటసాల గారి వీరాభిమాని  కాశి వెంకోబ రావు 
                                               9885482942