Tuesday, July 17, 2012

"చేతిలో చెయ్యేసి చెప్పు బావ"


జగపతి పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన చిత్రం "దసరా బుల్లోడు". ఈ చిత్రం 1971 లో సంక్రాంతి రోజున విడుదలై అఖండ విజయం సాదించింది. జగపతి అధినేత శ్రీ వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారు తొలి సారి దర్సకత్వం వహించారు. కాని ఎక్కడ తొలి సారి దర్సకత్వం వహించిన ఛాయలు కానరాదు. అంతల చిత్రాన్ని రక్తి కట్టించారు. ఎంతో అనుభవమున్న దర్సకుడిలా తీసారు, విజయం సాదించారు. సంగీతం శ్రీ కే వి మహదేవన్. అద్భుతమైన బాణీ లు సమకూర్చి అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ చేసారు. ఆత్రేయ వ్రాసిన "చేతిలో చెయ్యేసి చెప్పు బావ" ఒక మంచి మెలోడి పాట. ఆ పాట విందాము.


Sunday, July 15, 2012

"చిలిపి కనుల తీయని చెలికాడా"




ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ "కులగోత్రాలు" 24-08-1962 లో విడుదలైన చిత్రం.  కృష్ణకుమారి, అక్కినేని నాయికా నాయకులుగా నటించారు. దర్శకుడు: శ్రీ  కే.ప్రత్యగాత్మ. చక్కటి సంగీతం అందించారు  శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు.  డా.నారాయణ రెడ్డి గారు  వ్రాసిన పాట "చిలిపి కనుల తీయని చెలికాడా". ఈ గీతాన్ని ఘంటసాల, సుశీల గారలు పాడారు. పాట వింటూ ఉంటె ఎంతో హాయ్ గా ఉంటుంది. అంత చక్కగా బాణి కట్టారు శ్రీ సాలూరు వారు. ఆ పాట వినండి ఆనందించండి.

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా"


"భూమి కోసం" 1974 లో వచ్చిన చిత్రం. శ్రీ కే. బి.తిలక్ దర్సకత్వం వహించారు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం లో శ్రీ శ్రీ గారు వ్రాసిన    "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా".....ఒక విప్లమాత్మక పాట. ఘంటసాల గారు పాడారు. ఆ పాట విందాము.




Friday, July 13, 2012

"గాంధి పుట్టిన దేశమా ఇది, నెహ్రు కోరిన సంఘమా ఇది"







అక్కినేని, కాంచన, వాణిశ్రీ, కృష్ణం రాజు నటించిన చిత్రం "పవిత్ర బంధం". ఈ చిత్రం 25-02-1971 లో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీ వీరమాచనేని మధుసూదన్ రావు దర్సకత్వం వహించారు. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు సమకూర్చారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు బహుళ ప్రజాదరణ పొందినవి. ఘంటసాల పాడిన  "గాంధి పుట్టిన దేశమా ఇది, నెహ్రు కోరిన సంఘమా ఇది" మంచి సందేశం అందించే  పాట. నేటికి శ్రోతలు మరువ లేని పాట. ఆ పాట విందాం. రచన: శ్రీ ఆరుద్ర.




Wednesday, July 11, 2012

"పువ్వై విరిసిన పున్నమి వేళ "

గోకుల్ ప్రొడక్షన్ వారి "శ్రీ తిరుపతమ్మ కథ" 1963 లో విడుదలైంది. దర్శకుడు శ్రీ బి.యస్ నారాయణ. సంగీతం: శ్రీయుతులు బి.శంకేర్, పామర్తి.   డా. సి నారాయణరెడ్డి గారు వ్రాసిన "పువ్వై విరిసిన పున్నమి వేళ " మంఛి మేలోడి పాట. ఘంటసాల మాస్టారు పాడిన ఈ పాట విందాము. 


Monday, July 9, 2012

"ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నం"

శ్రీ బి.యన్.రెడ్డి దర్సకత్వం వహించి నిర్మించిన చిత్రం  "రంగుల రాట్నం". ఈ చిత్రం 1966 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందినది. చంద్ర మోహన్ తొలి చిత్రం. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు మరియు బి.గోపాలం. ఇందులో శ్రీ భుజంగరాయ శర్మ గారు వ్రాసిన టైటిల్ పాట "ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నం" ఒక అద్భుతమైన పాట. జీవిత సత్యాన్ని చాటి చెప్పే పాట. ఘంటసాల పాడడం ఈ పాటకు మరింత వన్నె తెచ్చింది. ఆ పాట విందాము.
 

Sunday, July 8, 2012

" మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నే డేలనో"



నవజ్యోతి ఫిలిమ్స్ "అడుగు  జాడలు" 1966 లో  విడుదలైన చిత్రం. శ్రీ యన్.టీ. రామారావు, జమున, యస్.వీ.రంగారావు ముఖ్య పాత్రధారులు. దర్సకత్వం శ్రీ తాపి చాణక్య. సంగీతం శ్రీ మాస్టర్ వేణు. ఈ చిత్రంలోని పాటలన్నీ మంఛి  మెలోడి తో కూడుకొన్నవి. ఘంటసాల,, జానకి గారలు పాడిన " మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నే డేలనో"
మంచి మెలోడి యుగళ గీతం. ఆ పాట విందాము.